ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ 'హలో' సినిమాతో రెండేళ్ల క్రితం టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా 'రణరంగం' సినిమాలో నటించింది. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన 'హీరో' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇది ఇలా ఉండగా చాలా కాలంగా కళ్యాణి ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ ని కళ్యాణి చాలా కాలంగా ప్రేమిస్తుందని అంటున్నారు. మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కాలేజ్ డేస్ నుండి మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా 43 సినిమాలు వచ్చాయి. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. వీరి రెండు కుటుంబాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్.. ప్రియదర్శన్ కూతురు కళ్యాణిల మధ్య బాల్యం నుండే స్నేహం కొనసాగుతూ వచ్చింది.

అది ఇప్పుడు ప్రేమగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రణవ్, కళ్యాణి తమ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు. తన ప్రేమ వ్యవహారానికి సంబంధించి కళ్యాణికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.  తను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజమేనని, భవిష్యత్తులో అతడినే పెళ్లి చేసుకుంటానని.. తన ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి కూడా తెలుసునని.. ఇంట్లో తమ ప్రేమకి ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చింది.

తను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు, వివరాలు మాత్రం ప్రస్తుతానికి చెప్పనంటూ తప్పించుకుంది. తను ప్రేమించే వ్యక్తి ప్రణవ్ కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రణవ్ తనకు సోదరుడు లాంటి  వాడని అతడితో ప్రేమ అనే విషయంలో అర్ధం లేదని చెప్పింది.