సంక్రాంతికు తనకు లక్ కలిసి వస్తుదనుకున్నాడు కళ్యాణ్ రామ్. తన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' తో అదృష్టం పరీక్షించుకోదలచి పెద్ద సినిమాలపై పోటీగా రంగంలోకి దూకాడు. తన జానర్ వేరు కాబట్టి ...ఆ సినిమాతో పాటు ఫ్యామిలీలు తన సినిమాని ఆదరిస్తాడనుకున్నాడు. అయితే ఈ ఫ్యామిలీ డ్రామా అనుకున్న ఎక్సపెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ కాలేక భాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఆరున్నర కోట్లు మాత్రమే షేర్ తెచ్చుకుంది. పండగ సీజన్ అయ్యిపోయింది. ఇప్పుడు కలెక్షన్స్ మరీ దారుణంగా చాలా చోట్ల డ్రాప్ లో ఉన్నాయి. దాంతో మంచి రేట్లు పెట్టి తీసుకున్న వారికి నష్టాలు తప్పేటట్లు లేవని తేలిపోయింది.

క్రితం సంవత్సరం ’118’ తో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైపు ‘శతమానం భవతి’, వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం  ‘ఎంత మంచివాడవురా. ఇంతకాలం మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టేనర్ సినిమా చేస్తూండటంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

అయితే ఈ మూవీతో కళ్యాణ్ రామ్‌కు సతీష్ వేగేశ్న మంచి హిట్ అందించలేకపోయారని మార్నింగ్ షోకే తేలిపోయింది.  ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కు కన్నీళ్లు ఒకటే తక్కువని అంటున్నారు. అంతగా డిజప్పాయింట్ అయ్యాడట. దానికి తోడు ఈ సంక్రాంతికి రిలీజైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటా పోటీగా కలెక్షన్స్ తో దూసుకుపోతూండటంతో....జనం ఇంకో సినిమా గురించి ఆలోచించే పరిస్దితి లేకపోవటం గమనార్హం.  

మెహరీన్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్‌ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్‌ శ్రీను నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్‌.