Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. చాలా స్పెషల్.. ఎందుకంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ నెక్ట్స్ ‘డెవిల్’తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలోనే విడుదల కానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ ను ఫస్ట్ సింగిల్ ను తాజాగా విడుదల చేశారు. 

Kalyan Rams Devil Movie First Single Maaye Chesi out Now NSK
Author
First Published Sep 23, 2023, 6:57 PM IST

‘బింబిసార’తో మంచి సక్సెస్ అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) .  చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో ఆయన. చివరిగా కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో త్రిపాత్రాభినయంతో అలరించారు. రొటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం Devil  చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డెవిల్ నుంచి వచ్చిన ‘మాయ చేశావే’ (Maaye Chesave) సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించింది. డెవిల్ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.

నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో దోహదపడుతోంది. సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడటం ప్రత్యేకమని చెప్పాలి. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం సాంగ్ ఆకట్టుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో చిత్రం రూపుదిద్దుకుంటోంది. సంయుక్త మీనన్ (Samyuktha Menon)   కథానాయిక. నవంబర్ 24న విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios