సినిమా సక్సెస్ కావాలంటే ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా జనాల్లోకి వెళ్లాలంటే సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. 2020 సంక్రాంతికి రానున్న సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ మారింది. ఓ వైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు మరోవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఒకరోజు గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి.

ఇకపోతే వీరితో పోటీ పడేందుకు కళ్యాణ్ రామ్ కూడా తన సినిమాను రెడీ చేస్తున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా! సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతోంది. సినిమా పోటీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనే సందేహాలు రోజుకోటి పుట్టుకొస్తున్నాయి. పైగా సినిమా ప్రమోషన్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయనే టాక్ వచ్చింది.   అయితే ఆ టాక్ కి చెక్ పెట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయాలనీ కళ్యాణ్ రామ్ సిద్దమవుతున్నాడు.

ప్రీ రిలీజ్ కి తమ్ముడు తారక్ తో స్పెషల్ ప్లాన్ వేసినప్పటికీ సాంగ్స్ కూడా జనాల్లోకి వెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగు 3 బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఒక మాస సాంగ్ పాడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా 'జాతరో జాతర' అనే సాంగ్ ని ఈ డిసెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సాంగ్ పై చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏ సాంగ్ ని రిలీజ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్న చిత్ర యూనిట్ కి ఫైనల్ గా జాతరో జాతర సాంగ్ బెస్ట్ అనిపించి న్యూ ఇయర్ మూడ్ లో వదలనున్నారు,. మరి ఆ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.