'ఎంత మంచివాడవురా' ఫుల్ రన్ భాక్సాఫీస్ కలెక్షన్స్!
సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.
సంక్రాంతికి రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' చివరకు పెద్ద డిజాస్టర్ గా తేలింది. సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది.
ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. దాంతో ఈ చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు పూర్తి స్దాయిలతో నష్టాలు తప్పలేదు. ఏరియా వైజ్ ఫుల్ రన్ కలెక్షన్స్ చూస్తే..
ఏరియా షేర్ (కోట్లలో)
-------------------- ----------------------------------------
నైజాం 1.39
సీడెడ్ 0.81
నెల్లూరు 0.22
కృష్ణా 0.58
గుంటూరు 0.70
వైజాగ్ 0.86
ఈస్ట్ గోదావరి 0.85
వెస్ట్ గోదావరి 0.60
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 6.01
భారత్ లో మిగతా ప్రాంతాలు 0.30
ఓవర్ సీస్ 0.20
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ 6.51
మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్.