సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్టార్ హీరోలు ప్రమోషన్స్ తో తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే మహేష్ బన్నీల సినిమాలు థియేటర్స్ వద్ద తెగ సందడి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు డిఫరెంట్ సినిమాలు ఈ నెలలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై కన్నేశాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల కలెక్షన్స్ జోరుగా సాగుతోంది.

ఇకపోతే కళ్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా కూడా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సిద్ధమైంది.  జనవరి 15న రాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అయితే బన్నీ - మహేష్ సినిమాల కంటే తమ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్లుగా ఎంత మంచివాడవురా టీమ్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇక ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడంపై కళ్యాణ్ రామ్ పాజిటివ్ గా స్పందించాడు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సంక్రాంతి రైతుల పండ‌గే కాదు.. మా సినిమా వాళ్ల‌కు కూడా పండ‌గే. ఫ్యామిలీ అంతా క‌లిసి సినిమా చూస్తుంది. ప్ర‌తిసారి సంక్రాంతి నాలుగు సినిమాలు వ‌స్త‌న్నాయి. మేమేదో వ‌చ్చేశామ‌ని కాదు.. పెద్ద బ‌డ్జెట్ సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు మీడియం బ‌డ్జెట్ సినిమాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. ఈ సీజ‌న్‌ను దాటితే ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ థియేట‌ర్‌కు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి. దానికి స‌మయం ప‌డుతుంది కాబ‌ట్టే సంక్రాంతికి రావాల‌ని అనుకున్నాం. మా బ‌డ్జెట్‌లో మాకు వ‌ర్కవుట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది' అని కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చారు.