టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత పొంగల్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అల్లు అర్జున్ - మహేష్ బాబు వంటి స్టార్ హీరోల మధ్య కళ్యాణ్ రామ్ కూడా తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే వారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్న తన ప్లాన్స్ తనకున్నాయనేల కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాను జనవరి 15న రిలీజ్ రిలీజ్ చేయబోతున్నాడు. జనవరి 12న బన్నీ - మహేష్ సినిమాలు రానున్నాయి. ఇకపోతే కళ్యాణ్ రామ్ రిలీజ్ విషయంలో పోటీకి దిగుతుండడానికి కారణం సినిమాపై ఉన్న నమ్మకమేనని తెలుస్తోంది.

సినిమా కథ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందట.  ఇక నందమూరి అభిమానులను ఆకట్టుకునే విధంగా పలు మాస్ ఎపిసోడ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ నటన సినిమాలో మెయిన్ హైలెట్ అని టాక్. ఫ్యామిలీకి సంబందించిన ఎమోషనల్ సీన్స్ లోనే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడట.

ఇక లవ్ సీన్స్ చివరగా ఎమోషనల్ సీన్స్ సినిమాకు మంచి బూస్ట్ ఇస్తాయట.  ఆ సీన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ నటన అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని తప్పకుండా సినిమా హిట్టవుతుందని కళ్యాణ్ రామ్ నమ్మకంతో ఉన్నాడు. మొత్తానికి నటనలో ఊసరవెల్లిలా రంగులు మార్చే కళ్యాణ్ రామ్ ఈ మంచి సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఎంత మంచివాడవురా చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో కళ్యాణ్ రామ్ సరికొత్తగా ఆకట్టుకోనున్నాడు.