యంగ్ బ్యూటీ కల్పిక గణేష్ తెలుగులో అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. కల్పిక గణేష్ తెలుగులో జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాల్లో నటించింది. మే 27న తన జన్మదిన వేడుకలు జరుపుకున్న కల్పిక గణేష్ కెరీర్ గురించి అనేక విషయాలు ప్రస్తావించింది. 

తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన అవకాశాలు వదులుకున్నట్లు కల్పిక గణేష్ పేర్కొంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, జులై చిత్రాల్లో నేను పోషించిన పాత్ర నాకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. అవి చిన్న రోల్స్ అయినప్పటికీ ప్రేక్షకులకు చేరువ కాగలిగాను. 

ఈ రెండు చిత్రాల తర్వాత నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. త్రివిక్రమ్ గారి దర్శత్వంలో అ..ఆ చిత్రంలో నితిన్ చెల్లి పాత్రకు మొదట నన్నే సంప్రదించారు. ఆ రోల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదే సమయంలో వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండడం వల్ల అ..ఆ వదులుకోవాల్సి వచ్చింది అని కల్పిక గణేష్ పేర్కొంది. 

విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న కేరాఫ్ కంచారపాలెం చిత్రంలో ముస్లిం యువతగా నటించే ఛాన్స్ కూడా దక్కింది. డేట్స్ కుదరకపోవడం వల్ల ఆ చిత్రాన్ని కూడా వదులుకున్నట్లు కల్పిక తెలిపింది. ఇప్పటి వరకు తాను నటించిన అన్ని చిత్రాల్లో హీరోలతో మంచి రిలేషన్ ఉందని కల్పిక పేర్కొంది.