మొన్న రజనీకాంత్ కు.. నేడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కు.. సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాడు ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) నటించిన పాన్‌ ఇండియా మూవీ జైలర్‌ (Jailer). రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ దూసుకెళ్తూనే ఉంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈసినిమాను నెల్సన్‌ దిలీప్ కుమార్‌ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేయగా.. కళానిధి మారన్‌ (kalanithi Maran) నిర్మించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. 

ఇక రజనీపని అయిపోయింది.. ఆయన మార్కెట్ పడిపోయింది అని ప్రచారం చేసిన వారి నోర్లు మూయిస్తూ.. జైలర్ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీమ్. అంతే కాదు మూవీ టీమ్ గ్రాండ్ గా పార్టీ కూడా చేసుకున్నారు. ఇక అందరికంటే ఈసినిమా నిర్మాత కళానిధి మారన్.. జైలర్ సక్సెస్ పై ఫుల్ ఖుషిగా ఉన్నారు. మూవీ టీమ్ కు వరాలు ప్రకటించారు.. స్టార్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ను ప్లాన్ చేశారు. 

Scroll to load tweet…

జైలర్ సక్సెస్ తో ప్రొడ్యూసర్ కళానిధి మారన్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. సినిమా సక్సెస్‎తో పాటు లాభాలు కూడా భారీగా రావడంతో అందులో నుంచి కొంత భాగాన్ని హీరో రజినీ కాంత్‌, దర్శకుడు నెల్సన్‌కు వాటాగా ఇచ్చారు. నిన్న రజినీకాంత్‌ను కలిసిన కళానిధి దాదాపు 1.24 కోట్ల విలువచేసే BMW X7 సిరీస్ కారును బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ప్రాఫిట్స్‌లో కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. ఇక తాజాగా దర్వకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్ కు కూడా కళానిధి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందజేశారు. 

Scroll to load tweet…

పోర్చే లేటెస్ట్‌ కారును కళానిథి నెల్సన్ దిలీప్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అందించారు. అంతే కాదు సినిమా లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్కురూపంలో ఇచ్చారు. నెల్సన్‌కు కారును గిఫ్ట్‌గా అందిస్తున్న వీడియోను సన్‌ పిక్చర్స్‌ సంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, జైలర్‌ విజయంతో తనకు గిఫ్ట్‌ ఇచ్చినందుకు కళానిధికి ధన్యవాదాలు తెలిపారు నెల్సన్‌. తన సోషల్‌ మీడియా ద్వారా పేజ్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు నెల్సన్ దిలీప్. జైలర్‌ విజయం కోసం ఈ అందమైన కారును నాకు బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు కళానిధి మారన్‌ సర్‌. మీతో కలిసి పనిచేయడం గర్వంగా, సంతోషంగా ఉంది. చెక్‌ నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ రాసుకొచ్చారు.