దిశ కేసులో నలుగురు నిందితులని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో  నలుగురు నిందితులు మరణించారు. నిందితులని ఎన్ కౌంటర్ చేయడం ద్వారా పోలీసులు దిశకు సరైన న్యాయం చేశారని  సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 

సినీ రాజకీయ ప్రముఖులంతా పోలీసులని ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ సెలెబ్రటీలు ఒక్కొక్కరుగా నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందిస్తున్నారు. ఇకపై ఇలాంటి దారుణాలకు పాల్పడాలంటే భయాన్ని కలిగించేలా తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

తాజగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, యంగ్ హీరో నితిన్ దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ ట్విట్టర్ లో స్పందించారు. కాజల్ అగర్వాల్ 'తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేసింది. 

మరణశిక్షని సమర్ధించను కానీ.. మంచు లక్ష్మీ కామెంట్స్!

ఇక యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. 'న్యాయం జరిగింది.. తెలంగాణ పోలీసులని అభినందిస్తున్నా. ఇకపై ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడాలనే ఆలోచనకు కూడా రాకుండా ప్రతి ఒక్కరికి ఈ సంఘటన గుర్తుండి పోవాలి. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా' అని కామెంట్ చేశాడు. 

''ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి''

నవంబర్ 27న నలుగురు నిందితులు దిశని అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య చేశారు. ఈ సంఘటనపై ప్రజలంతా తీవ్ర అగ్రహావేశలు వ్యక్తం చేసారు. నిందితులని వెంటనే ఉరితీయాలనే డిమాండ్ వినిపించింది. శుక్రవారం రోజు పోలీసులు ఊహించని విధంగా ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.