జయాపజయాలతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. మెయిన్ గా తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సీత - రణరంగం వంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య బేబి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటోంది.

రీసెంట్ గ కోలివుడ్ లో బేబీ చేసిన కోమలి సినిమా 25కోట్లకు పైగా లాభాల్ని అందించింది. దీంతో అక్కడ ఛాన్సులు కూడా గట్టిగానే వస్తున్నాయి. రీసెంట్ గా బేబీ ఒక తమిళ్ అఫర్ ని దక్కించుకున్నట్లు టాక్. యువ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్న ఒక సినిమాలో అమ్మడు కథానాయికగా అవకాశం అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ రొమాంటిక్ కథ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ లో ఉంది.  హీరోయిన్ విషయంలో త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతానికి కాజల్ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో ముంబైసాగా లో నటిస్తోంది. అలగే మరికొన్ని కథలను కూడా బేబీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం. అసలైతే కాజల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ బాలీవుడ్ లో ముంబయ్ సాగా అనే సినిమా అమ్మడి ఆశలకు నిచ్చెన వేసింది. ఎప్పటి నుంచో బాలీవుడ్ లో ఒక మంచి సినిమాతో తన అదృష్టాన్ని పరికంచుకోవాలని అనుకుంది. ఇక ఇప్పుడు అవకాశం లభించడంతో నెక్స్ట్ మరిన్ని ఆఫర్స్ అందుతాయని నమ్మకంతో పెళ్లి మ్యాటర్ ని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం.