సక్సెస్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో వెలుగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. ముఖ్యంగా తెలుగులో చందమామ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య బేబి తెగ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటోంది. రీసెంట్ గ కోలివుడ్ లో బేబీ చేసిన కోమలి సినిమా 25కోట్లకు పైగా లాభాల్ని అందించింది.

అయితే తనలో ఉన్న ఒక టాలెంట్ ని ఎవరు పెద్దగా గుర్తించడం లేదన్నట్లు  చెప్పిన కాజల్ కామెడీ అండ్ యాక్షన్ యాంగిల్ లో తాను చాలా బెస్ట్ అని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పింది.  తనలో కామెడీ యాంగిల్ చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతూ.. బాద్షా సినిమాలో తన కామెడీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది.అలాగే ఎవరు ఉహించని విధంగా బేబి యాక్షన్ అండ్ స్టంట్స్ లో కూడా మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఆ టాలెంట్ ని ఎవరు ఎక్కువగా వాడుకోవడం లేదని తెలిపింది.  

మరి ఎవరైనా కాజల్ ఇంటర్వ్యూ చూసి నెక్స్ట్ సినిమాల్లో ఆమె టాలెంట్ ని ఉపయోగించుకుంటారో లేదో చూడాలి. ఇక ప్రస్తుతానికి కాజల్ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో ముంబైసాగా లో నటిస్తోంది. అలగే మరికొన్ని కథలను కూడా బేబీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.