సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి కరోనా వైరస్ పై ఊహించని విధంగా స్పందించింది. తానకు ఎదురైనా విషాద విషయాన్నీ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. కరోనా వైరేస్ వల్ల ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు. దీంతో

సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ వైరస్ కారణంగా కొన్ని పేద జీవితాలు చాలా ఇబ్బంది పడుతున్నట్లు కాజల్ తెలిపింది.

'రీసెంట్ గా ఒక టాక్సీ డ్రైవర్ గత 48గంటల్లో నేనే తన ఫస్ట్ కస్టమర్ అని చెప్పాడు. నా భార్య ఈ రోజైనా నేను ఇంటికి సరుకులతో వస్తానని ఆశపడుతోందని అతను నాతో చెప్పాడు. అదే విధంగా అతను తన చివరి కస్టమర్ ని వదిలేసిన తరువాత 70కిలోమీటర్లు డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. అప్పుడు నా గుండె పగిలింది. వెంటనే అతనికి నేను 500రూపాయలు ఎక్కువగా ఇచ్చాను. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి మనం ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది' అని కాజల్ వివరణ ఇచ్చింది.

ఇక అంతకుముందు కాజల్ కరోనా కారణంగా తాను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరణ ఇచ్చింది. చాలా మంది వైద్యులు సలహా మేరకు కరోనాని అరికట్టేందుకు వీలుగా ఆల్కహాల్ ని  హ్యాండ్ శానిటైజర్స్ గా వాడుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  నేను తీసుకున్న  నేను గత మూడ్రోజుల్లో నా చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాల్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఇన్ని రోజులు నేను పుచ్చుకున్న దానికంటే ఎక్కువ` అంటూ కాజల్ ట్వీట్ చేసింది.