చాలా కాలం తరువాత కోలీవుడ్ హీరో కార్తీ ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా కార్తీ మార్కెట్ ని పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్ హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసిన కార్తీ ఫార్ములా వర్కౌట్ కావడంతో బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాలీవుడ్ లో కూడా ఖైదీ సినిమా రీమేక్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఖైదీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రభు నిర్మించారు. ఇక అదే బ్యానర్ ప్రముఖ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి హిందీలో సినిమాని రూపొందించాలని చూస్తున్నారు. అయితే కార్తీ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదు.

త్వరలోనే సినిమాకు సంబందించిన ప్రధాన తారాగణాన్ని సెలెక్ట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. మరీ బాలీవుడ్ జనాలకు ఖైదీ కాన్సెప్త్ ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం కార్తీ సుల్తాన్ అనే ఒక సినిమాలో నటుస్తున్నాడు. అలాగే మణిరత్నం బిగ్ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్ లో కూడా నటిస్తున్నాడు. ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న తరువాత కార్తీ రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు టాక్.