Asianet News TeluguAsianet News Telugu

''భయమొక్కటే పరిష్కారం..'' సమంత కామెంట్స్!

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. 

justice for disha: 'Fear is a great solution and sometimes the only solution' says  samantha
Author
Hyderabad, First Published Dec 6, 2019, 10:12 AM IST

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

justice for disha: న్యాయం జరిగింది.. ఎన్టీఆర్!

సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. 

దిశ హత్యాచారం జరిగిన సమయంలో సమంత స్పందించలేదని సోషల్ మీడియాలో ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎన్కౌంటర్ పై సమంత స్పందించింది. ''భయం ఓ గొప్ప పరిష్కారం.. కొన్నిసార్లు అదొక్కటే సరైన సొల్యూషన్.. ఐ లవ్ తెలంగాణా'' అంటూ రాసుకొచ్చింది. 

అలానే తాను దిశ హత్యాచారంపై ఎందుకు స్పందించలేదో చెప్పుకొచ్చింది. ''ఈ సంఘటన జరిగినప్పుడు నేనేమీ స్పందించలేదు.. ఎందుకంటే బాధితులకు నా సంతాపం చెల్లించలేదని ఆరోపిస్తూ నాకు వచ్చిన ప్రతి సందేశం సమాజంలో ఉన్న మహిళలకు నేనేమీ చేయలేకపోయాననే విషయాన్ని గుర్తు చేసింది. ఆ అపరాధం నుండి నన్ను విడిపించడానికి ఒక్క ట్వీట్ సరిపోదనిపించింది'' అంటూ చెప్పుకొచ్చింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios