లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కుదరడం లేదని, ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌కు నివాళులర్పించాలని జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్టు తెలియవస్తుంది. 

మాజీ ముఖ్యమంత్రి, విశ్వా విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి రోజున ఆయన కుటుంబీకులంతా హైదరాబాద్‌లోని ఎన్టీయార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించడం రివాజు. 

అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కుదరడం లేదని, ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌కు నివాళులర్పించాలని జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్టు తెలియవస్తుంది. 

జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు గురువారం ఎన్టీయార్ ఘాట్‌కు రావడం లేదని నిర్మాత, ఎన్టీఆర్ కు పీఆర్వోగా వ్యవహరిస్తున్న మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

Scroll to load tweet…

`ప్రజల భద్రత దృష్ట్యా ఎన్టీయార్, కల్యాణ్‌రామ్ లు రేపు ఎన్టీయార్ ఘాట్‌కు రావడం లేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారికి వారి ఇంటి వద్దే నివాళులు అర్పిస్తారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు గుమికూడవద్దు అన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు`అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం అమాంతం పెరిగిపోయింది. ఒకే రోజు 71 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,991కి చేరింది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 57కి చేరుకుంది.

అయితే ఒక్కరోజే 120 మంది డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 1,284కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 650 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి 7, మేడ్చల్‌లో 6 , సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పేట్‌లో ఒక్కొక్కరికి, మరో 12 మంది వలసకూలీలకు కరోనా సోకింది.

కాగా మార్చి 11వ తేదీ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.