కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మత్తు వదలరా అనే సినిమాలో నటించిన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతోనే ఒక డిఫరెంట్ జానర్ ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఆ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.  ఇటీవల రిలీజైన పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు మరో లుక్ కి జూనియర్ ఎన్టీఆర్ బూస్ట్ ఇచ్చాడు.  వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో వెలుగుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ ఈ సంస్ద కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో  ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రంకొత్త వాళ్లతో రూపొందనుంది.  సినిమా లుక్ ని రిలీజ్ చేసిన తారక్ చిత్ర యూనిట్ కి తన విషెస్ అందించాడు.

రితేష్‌ రానా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో కొత్త తరహా కంటెంట్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక  పూర్తి నటినటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమా న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఉండబోతుందని తెలుస్తోంది. యూత్ ఎదుర్కొంటున్న ఓ చిత్రమైన సమస్యను సినిమాలో ప్రస్తావించనున్నట్లు చెప్తున్నారు.  

యూత్ టార్గెట్ సాగే ఈ సినిమా క్లిక్ అయితే మరిన్ని కంటెంట్ బేసెడ్ సినిమాలు చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.   దాంతో కొత్త తరహా కథాంశాలతో విల‌క్ష‌ణ‌మైన సినిమాలు నిర్మించడానికి కొన్ని కథలు ఎంపిక చేసి , ఈ సినిమా మొదట ట్రైల్ క్రింద వదులుతున్నట్లు వినికిడి. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ఈ సినిమాపై మంచి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది