ఎన్టీఆర్  పెద్ద కుమారుడు అభయ్ రామ్ అప్ డేట్స్ అంటే అభిమానులకు ప్రాణం. ఆయన తాజాగా తన తల్లి లక్ష్మీ ప్రణతి తో కలిసి స్కూల్ ఫెస్టివల్ కి హాజరయ్యినప్పటి ఫొటోలు బయిటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో చాలా క్యూట్ గా ఉన్నాడు. అతను నవ్వే నవ్వు తన తండ్రి ఎన్టీఆర్ ని గుర్తు చేస్తోంది. ఐదు సంవత్సరాల అభయ్ రామ్ అందరితో చాలా కలవిడిగా ఉంటారు. స్కూల్ కు వచ్చిన లక్ష్మీ ప్రణతి...తన కొడుకు ప్రెండ్స్ తో ముచ్చటిస్తూ కనపడ్డారు.ఇక అభయ్ రామ్ పుట్టినప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేదే లేకుండా ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ తో రాకెట్ లా దూసుకుపోతుంది.ఓ ప్రక్క వరుస సక్సెస్ లు, మరోవైపు ముద్దులొలికే కొడుకుతో వెల్లివిరుస్తున్న ఆనందం ఎన్టీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్టీఆర్ ని నిశితంగా అబ్జర్వ్ చేసేవరికి అది కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. అభయ్ రామ్ అంటే ఎన్టీఆర్ కు ఎంత ప్రాణమంటే ...వాడి కోసం ఆయన పార్టీలకు సైతం దూరమయ్యారు.ఈ విషయమై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేనిప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా, నా కొడుకు అభయ్ రామ్ నన్ను ఫాలో అవుతున్నాడని, నన్ను నిశితంగా పరిశీలిస్తున్నాడని, అందుకే తనకు నేను ఓ బ్యాడ్ ఎగ్జామ్పుల్ గా మిగలదలచుకోలేదని అన్నారు.ఆ మధ్య అభయ్ రామ్ ను నువ్వు ఎందుకు పుట్టావ్ అని అడిగితే.. నాన్న కోసం అని చెప్పాడని.. దాంతో ఆ మాట నాలో చాలా మార్పులకు కారణమైందని.. అందులో ఒకటి ఇకపై పార్టీలకు దూరంగా ఉండటమేనని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో చరణ్‌తో కలిసి నటిస్తున్నారు.