సౌత్ ఇండియన్ మార్కెట్ లో రోజురోజుకి తెలుగు హీరోల డామినేషన్ పెరుగుతోంది. ఒకప్పుడు తమిళ్ సినిమా హీరోల మార్కెట్ మాత్రమే పెరుగుతూ ఉండేది. ఇప్పుడు లోకల్ హీరోలు వారి కథలను నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తుండడంతో బిజినెస్ స్టాండర్డ్ కూడా పెరుగుతోంది. ఆ లిస్ట్ లోకి జూనియర ఎన్టీఆర్ కూడా చేరినట్లు సమాచారం.  కమర్షియల్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటున్న తారక్ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది.

అరవింద సమేత వరకు 20కోట్ల లోపే తీసుకున్న తారక్ ఇప్పుడు ఆ నెంబర్ ని డబుల్ చేయాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఏన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అరవింద సమేత అనంతరం రెండేళ్ల పాటు వెండి తెరకు దూరమవుతున్న తారక్ నెక్స్ట్ ఇయర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మల్టి స్టారర్ సినిమా అయిపోగానే నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు.

RRR కు 25కోట్లు ఛార్జ్ చేస్తున్న తారక్ ఆ తరువాత సినిమా నుంచి 40కోట్లకు తీసుకునే అవకాశం ఉందట. ఎందుకంటె ఆ బిగ్ మల్టీస్టారర్ తో తారక్ రేంజ్ నేషనల్ వైడ్ గా తప్పకుండా పెరుగుతుందనే చెప్పవచ్చు. దీంతో త్రివిక్రమ్ సినిమా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తారక్ కూడా రెమ్యునరేషన్ డోస్ పెంచాలని అనుకుంటున్నాడట.

ఇక త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు పై రీసెంట్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అల.. వైకుంఠపురములో సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు అదే తరహాలో తారక్ తో కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ కి జతగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసింది. త్రివిక్రమ్ సినిమాను కళ్యాణ్ రామ్ చినబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.