తమిళనాట ఇళయదళపతి విజయ్ తిరుగులేని హీరో. ప్రతి చిత్రానికి విజయ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అతడు నటించే చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు అదిరిపోతున్నాయి. విజయ్ రీసెంట్ గా నటించిన చిత్రం బిగిల్. దీపావళి కానుకగా ఈ చిత్రం ఇటీవల విడుదలయింది. 

తెలుగులో విజిల్ టైటిల్ తో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగు వర్షన్ హక్కులని నిర్మాత మహేష్ కోనేరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా విజిల్ చిత్రం మంచి లాభాలని తెచ్చిపెట్టింది. దీనితో మహేష్ కోనేరు ఇటీవల విజయ్ ని తన నివాసంలో కలిశారు. 

ఈ సందర్భంగా విజయ్ తో జరిగిన మీటింగ్ గురించి మహేష్ కోనేరు ప్రస్తావించారు. 'విజయ్ సర్ ని కలవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో విజిల్ చిత్రాన్ని రిలీజ్ చేయడం, ప్రమోట్ చేసిన విధానం విజయ్ సర్ కు నచ్చింది. ఆయన అభినందించారు. విజయ్ సర్ సింప్లిసిటీకి ఆశ్చర్యపోయా. 

తన తదుపరి చిత్రంతో నేరుగా తానే తెలుగు అభిమానులని కలుస్తానని హామీ ఇచ్చారు. మరో సంతోషకర విషయం ఏంటంటే.. విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. పరస్పరం ఒకరికొకరు అభినందించుకున్నారు అని మహేష్ కోనేరు సోషల్ మీడియాలో తెలిపారు. 

ఎన్టీఆర్, మహేష్, నితిన్ తో తొలిసారి కుర్రభామల రొమాన్స్.. అప్ కమింగ్ కాంబినేషన్స్ అదుర్స్!

విజిల్ చిత్ర ప్రచార కార్యక్రమంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. త్వరలో తాను ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అట్లీ దర్శత్వంలో తెరకెక్కిన బిగిల్ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.