కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో జన జీవనం స్తంభించిపోయింది. దీంతో పేదల జీవితాలు మరి దుర్భరంగా మారిపోయాయి. రోజు కూలికి వెలితే గానీ పూట గడవని వారికి తిండి దొరకటమే కష్టంగా మారింది. కొంత మంది తమ వంతుగా సరుకులు,  ఆహార పదార్థాలు  అంద చేస్తున్నా అందరికీ అవి అందటం లేదు.

అయితే తాజాగా ఎన్టీఆర్ కూడా తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలతో పాటు కరోనా క్రైసిస్‌ చారిటీకి కూడా సాయం చేసిన ఎన్టీఆర్‌, తాజాగా తన ఇంట్లో, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సాయం చేశాడు. లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు ముందుగా జీతాలు చెల్లించిన ఎన్టీఆర్, మరేదైన అవసరం ఉన్నా తన టీంను సంప్రదించాలని సూచించాడట. ఎన్టీఆర్‌ పెద్ద మనసు చూపించిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు.  పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు.