ఒకప్పుడు స్టార్ హీరో నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తే చాలు అనుకునే అభిమానులు ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. మంచి సినిమా అందించాలనే ఆలోచనతో హీరోలు తీసుకుంటున్న సమయం అభిమానులను నిరాశను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పరిస్థితి కూడా అలానే ఉంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా తారక్ రెండేళ్లు వెండి తెరకు దూరమవుతున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ కాస్త వేగంగానే సినిమాలను పూర్తి చేస్తాడు అయితే అరవింద సమేత తరువాత తారక్ కి కొన్ని ప్రాజెక్ట్స్ చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. ఎందుకంటె RRR సినిమా కోసమే. 2019లో మిస్సయిన తారక్ ని 2020లో అంచనాలకు తగ్గట్టుగా చూడవచ్చని అనుకున్నారు.

మెగా అభిమానులు కూడా ఆల్ మోస్ట్ రామ్ చరణ్ ని మిస్ అవుతున్నారు. అయితే 2019లో వినయవిధేయ రామతో వచ్చిన విషయం తెలిసిందే.  కానీ నందమూరి అభిమానులే తారక్ ని ఎక్కువగా మిస్ అవుతున్నారు. RRR సినిమా సమ్మర్ లో రావడం లేదని. నెక్స్ట్ ఇయర్ జనవరి 8న రానుందని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేయడం అందరికి షాకిచ్చింది.

దర్శకధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కావడంతో రెండేళ్లు పూర్తిగా ఆ సినిమాకే సమయాన్ని కేటయించేందుకు తారక్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనీ డిస్కస్ చేస్తున్నాడు. కానీ ఆ సినిమా RRR తరువాతే ఉంటుంది. దీంతో నందమూరి అభిమానులు 2019లో వెయిట్ చేసినట్టుగానే 2020లో కూడా వెయిట్ చేయక తప్పదు. మరీ ఆ సినిమా నందమూరి అభిమానుల దాహాన్ని ఎంతవరకు తీరుస్తోంది చూడాలి.