దసరా సెలెవులను టార్గెట్ చేస్తూ బిగ్ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి సిద్దమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి వార్ సినిమా అలాగే టాలీవుడ్ నుంచి సైరా సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా హాలీవుడ్ నుంచి జోకర్ సినిమా కూడా అదే తరహాలో రిలీజయ్యింది. మొదట ఈ సినిమా పోటీలో నిలుస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. 

వాయిదా అప్డే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఎవరు ఊహించని విధంగా జోకర్ ఇండియన్ బిగ్ బడ్జెట్ మూవీస్ కి గట్టిపోటీనే ఇస్తోంది. మల్టిప్లెక్స్ థియేటర్స్ లో కలెక్షన్స్ జోరుగా అందుతున్నాయి. ఇక తమిళనాడులో కూడా సినిమా సైరా , వార్ లను దెబ్బకొట్టింది. ఆ రెండు సినిమాలకంటే కూడా జోకర్ మంచి వసూళ్లను అందుకోవడం విశేషం. సైరా తమిళ్ లో డైరెక్ట్ గా తమిళ్ లో అనువాదమయ్యింది. 

ఇక జోకర్ సినిమా మెయిన్ గా చెన్నైలో 19లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సైరా వార్ సినిమాలు సమానంగా 14 లక్షలతో సరిపెట్టుకున్నట్లు సమాచారం.. జోకర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో కలెక్షన్స్ డోస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సైరా తెలుగు రాష్ట్రాల్లో పై చేయి సాధించగా బాలీవుడ్ లో అనుకున్నంతగా రాణించడం లేదు. ఇక వార్ సినిమా బాలీవుడ్ లో తన సత్తాను చాటుకుంటోంది.