ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గత కొంత కాలంగా హాలీవుడ్ సినిమాలు మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఇండియన్ సినీ మార్కెట్ గడిచిన పదేళ్లలో చాలానే పెరిగింది. దీంతో ఎప్పుడు లేని విధంగా హాలీవుడ్ లో తెరకెక్కిన ఇంగ్లీష్ సినిమాలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయి.  

ఇక రీసెంట్ గా వచ్చిన జోకర్ సినిమా కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో కాస్త స్లోగా కలెక్షన్స్ ని అందుకుంది. పాజిటివ్ టాక్ తో ఆ తరువాత వైరస్ లా అన్ని వర్గాల ప్రేక్షకులపై ఎటాక్ చేసింది. సినిమాకు సంబందించిన 13రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే.. 60కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం.  

పోటీగా బాలీవుడ్ లో వార్ సినిమా వచ్చినప్పటికీ జోకర్ హవా ఏ మాత్రం తగ్గలేదు, ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. సెకండ్ వీక్ అనంతరం మిగతా ఏరియాల్లో కూడా వసూళ్లను అందుకోవడం స్టార్ట్ చేసింది. సైరా కలెక్షన్స్ పై ఈ సినిమా కొంత ఎఫెక్ట్ చూపించిందని చెప్పవచ్చు. రిలీజయింది కొన్ని థియేటర్స్ లోనే అయినా వసూళ్లతో జోకర్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిందనే చెప్పాలి.