అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరొకసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రేదేవితో పోల్చడం ఏమాత్రం సరికాదని జాన్వీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే.

మొదటి సినిమా 'ధఢఖ్' అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. అయితే చాలా సార్లు కొంతమంది సెలబ్రెటీలు సైతం జాన్వీని శ్రీదేవితో పోల్చారు. అది తనకు ఏ మాత్రం ఇష్టం లేదని జాన్వీ వివరణ ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తనదైన శైలిలో మరొకసారి వివరణ ఇచ్చింది.

'మనుషులు అందరూ కూడా ఒకే విధంగా ఉండరు. ప్రతి వ్యక్తిలో ఎవరి సరిపడని ఒక స్వభావం అయితే ఉంటుంది. కొంతమంది నన్ను చూసి అమ్మలా ఉన్నావ్ అంటారు. నిజానికి అది సరికాదనే చెప్పాలి. ఎందుకంటె.. ఆమె వ్యక్తిత్వం.. నా వ్యక్తిత్వం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక నటనపరంగా కూడా అమ్మకు నాకు చాలా వ్యత్యాసం ఉంది. అమ్మలా ఉండలేను. ఈ విషయం అందరికి అర్ధమవ్వాలి అంటే నేను ఇంకా కొన్ని ఎక్కువ సినిమాలు చేయాలి. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది' అని జాన్వీ వివరణ ఇచ్చింది.