అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే నార్త్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల తండ్రి బోణి కపూర్ పుట్టినరోజు సందర్బంగా అమ్మడు చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బోనికపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విధంగా వివరించింది. "నేను ఇంత ఎనర్జీతో కనిపించడం వెనుక సీక్రెట్ ఏమిటని అడుగుతుంటారు కదా.. దానికి మిరే కారణం నాన్న. ఆ చలాకీతనం మీ నుంచే నేర్చుకున్నాను. మనకు ఇష్టమైన పనులు చేస్తూ ముందుకు సాగాలన్న విషయం మీ నుంచే నేర్చుకున్నాను. క్రిందపడిన ప్రతిసారి అదే వేగంతో పైకి లేవడం అలవాటు చేసుకున్నా.

నువ్వే నా బెస్ట్ నాన్నవి. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వే.  ఐ లవ్ యూ నాన్న. నువ్వు గర్వపడేవిధంగా ముందుకు సాగుతా" అని జాన్వీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.  ఇకప్రస్తుతం జాన్వీ కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన గుంజన్ సక్సేనా బయోపిక్ తో సిద్ధమవుతోంది..కార్గిల్ లో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా పైలెట్ అయిన గుంజన్ జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు ఉన్నాయి.

read also: జాన్వీకపూర్ కొత్త కారు ఫిచర్లు ఇవే

కార్గిల్ యుద్ధంలో ఆ ఒక్క మహిళ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది సినిమాలో చూపించనున్నారు. గుంజన్ సక్సెన గా జాన్వీ కపూర్ సినీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.  గ్లామర్ తో కాకుండా కెరీర్ మొదట్లోనే జాన్వీ ఇలాంటి కథల్లో నటించడం ప్రశసించాల్సిన విషయమని ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది మార్చ్ 13న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.