అభిమానులకు చేరువగా ఉండేందుకు, ప్రమోషన్స్ కి నటీనటులు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటుంటారు. కానీ కొందరు సెలెబ్రిటీలు ఇప్పటికి సోషల్ మీడియాకు దూరంగానే ఉన్నారు. హీరోయిన్లకు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండడం చూస్తూనే ఉన్నాం. 

సీనియర్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్ హాలీవుడ్ లో ఎంతటి ప్రఖ్యాత నటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెన్నిఫర్ అనిస్టన్ కు రెండు రోజుల క్రితం వరకు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదు. మంగళవారం రోజు జెన్నిఫర్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతా తెరిచింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

And now we’re Instagram FRIENDS too. HI INSTAGRAM 👋🏻

A post shared by Jennifer Aniston (@jenniferaniston) on Oct 15, 2019 at 6:03am PDT

దీనితో ఆమె అభిమానులంతా ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ప్ పై ఏకంగా దండయాత్రే చేశారు. ఆమెకు  ఇన్స్టాగ్రామ్ లోకి వెల్ కమ్ చెప్పేందుకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేశారు. దీనితో దెబ్బకు ఇన్స్టాగ్రామ్ కొన్ని నిమిషాల పాటు క్రాష్ అయిపోయింది. 

కేవలం రెండు రోజుల్లోనే జెన్నిఫర్ అనిస్టన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు పైగా చేరుకుంది. దీనితో జెన్నిఫర్ అనిస్టన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

జెన్నిఫర్ తన స్నేహితులతో తీసుకున్న సెల్ఫీ, మరో వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియోను 10 లక్షలమంది వీక్షించారు. ఆమె సెల్ఫీని 12 లక్షల మంది లైక్ చేశారు. ఈ 50 ఏళ్ల నటికి ఉన్న ఫాలోయింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I swear I didn’t mean to break it... Thank you guys for the kind, glitchy welcome ❤️

A post shared by Jennifer Aniston (@jenniferaniston) on Oct 16, 2019 at 2:39pm PDT

ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన జెన్నిఫర్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఆమె మాజీ భర్త. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2005 లో విడిపోయారు. అనంతరం ఆమె జస్టిన్ థేరోక్స్ ని వివాహం చేసుకుంది. రెండేళ్లకే అతడి నుంచి కూడా విడిపోయింది.