Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీ లో Japan, tiger 3 ఎందులో, ఎప్పుడు

థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Japan  tiger 3 movies streaming date is out jsp
Author
First Published Dec 5, 2023, 11:13 AM IST


భాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఓటిటి రిలీజ్ డేట్ లు ఫిక్స్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు సైతం ఓటిటిలోకి అతి త్వరలో వచ్చేస్తున్నాయి.  ఈ క్రమంలో సల్మాన్ టైగర్ 3, కార్తీ నటించిన జపాన్ చిత్రాలు ఓటిటి రిలీజ్ కు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఆ వివరాలు చూద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (Salman Khan) న‌టించిన తాజా చిత్రం టైగర్ 3. ఇక టైగర్‌ ప్రాంఛైజీలో సల్మాన్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్‌లో ఇప్పుడు టైగర్‌ 3 (Tiger 3)వచ్చింది. మనీశ్‌ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా  రిలీజ్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి యావరేజ్  రెస్పాన్స్ వ‌చ్చింది. 

 ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న‌ విడుదల చేసారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్‌ అయ్యింది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన  ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్‌ జిందా హే సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.

 ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటిటి వెర్షన్ కు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.   ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 12న స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది. సాధారణంగా దాదాపు అన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీ రీలీజ్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు నెలరోజుల తరువాత డిసెంబర్ 12న ఓటీటీ ప్రైమ్‌లో విడుదల కానుంది. 

ఇక ఈ మధ్యనే  కార్తీ... జపాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. జపాన్ సినిమా నవంబర్‌ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కార్తీ డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ స్లాంగ్ లో మాట్లాడి అలరించాడు. కానీ జపాన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

 ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.  డిసెంబర్‌ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios