శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన నటించబోతుందని ఆ మధ్య వార్తలు తెగ వార్తలు వచ్చాయి. అయితే వాటిని రూమర్స్ అని చాలా మంది కొట్టిపారేసారు.  కానీ ఇప్పుడా రూమర్స్ నిజం అయ్యాయి.తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న ఫైటర్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా చెయ్యటానికి ఓకే చేసింది.  విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

 ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నాడట, కరుణ్ జోహారే జాన్విని ఒప్పించాడని సమాచారం.  ‘ఫైటర్‌’ కోసం జాన్వి రూ.3 కోట్లు రెమ్యునేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. జీఎస్టీ తో కలిపి మూడున్నర కోట్లు కానుంది. అడ్వాన్స్ గా ఆమెకి కోటి రూపాయలు కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ రెమ్యునేషన్ విని విజయ్ దేవరకొండకు మైండ్ బ్లాక్ అయ్యిందంటున్నారు. ఇన్నాళ్లుగా తన సరసన చేసిన ఏ హీరోయిన్ కూడా ఈ స్దాయి రెమ్యునేషన్ తీసుకోలేదు దాదాపు తన రెమ్యునేషన్ తో సమానంగా ఉందని కామెంట్ చేసారని చెప్పుకుంటున్నారు.

దీప్తి సునైనా.. హాట్ క్లీవేజ్ షో!

ఈ వార్తలే నిజమైతే జాన్వి నటిస్తున్న ఫస్ట్ సౌతిండియా సినిమా ఇదవుతుంది. అంతేకాదు ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. కాబట్టి నార్త్ లో విజయ్‌ అరంగేట్రం ఈ చిత్రంతోనే జరుగుతుంది.

ఫైటర్ కథ విన్న కరణ్ జోహార్... ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించి పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు.  ఇక ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపొందుతోంది. ఆ తరువాత ఆయన సినిమాగా 'ఫైటర్' సెట్స్ పైకి వెళ్లనుంది.