అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టం కొద్దీ జాన్వీ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె దుబాయ్ లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. దీనితో జాన్వీ కపూర్ కెరీర్ బాధ్యతని బోనికపూర్ చూసుకుంటున్నారు. 

జాన్వీ నటించిన తొలి చిత్రం దఢక్ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం జాన్వీ మరికొన్ని చిత్రాలకు రెడీ అవుతోంది. అందం విషయంలో కేర్ తీసుకోవడం జాన్వికి తల్లి నుంచి అలవాటైంది. అందుకే జాన్వీ క్రమం తప్పకుండా జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిజిక్ ని మైంటైన్ చేస్తోంది. 

బాలీవుడ్ లో రాణించడం కోసం ఇటీవల జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ పెంచేంసింది. అందాలు ఆరబోసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ జిమ్ కి వెళ్లే సమయంలో ఆమె ధరించే పొట్టి బట్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నెటిజన్లు జాన్వీ బట్టల గురించి హాట్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయంలో జాన్వీ కపూర్ తెగ ఫీలైపోతోంది. అభిమానులు తాను వేసుకునే డ్రెస్ పై ఫోకస్ తగ్గించాలని కోరుకుంటోంది. ఇంతకు ముందు ఎవరు మాట్లాడిన నా దఢక్ సినిమా గురించి మాట్లాడేవారు. ఆ చిత్రంలో నా నటన బావుందనేవారు. కానీ ఇప్పుడు న డ్రెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. దీనిని నేను తప్పుపట్టను. ఎందుకంటే సెలెబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్ పై అభిమానుల్లో సహజంగానే చర్చ జరుగుతుంది. 

రామ్ చరణ్ నటనకు ఇన్ఫోసిస్ సుధామూర్తి ఫిదా.. రంగస్థలంపై ప్రశంసలు!

కానీ భవిష్యత్తులో తన డ్రెస్ గురించి కాకుండా.. తాను నటించే సినిమాల గురించి అభిమానులు మాట్లాడుకోవాలని కోరుతున్నా. ఆ దిశగా తాను కూడా కష్టపడుతానని జాన్వీ అంటోంది.