అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్‌. దడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనూ నటిగా తల్లి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల భామ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.

ఈ సందర్భంగా ఆమె జీవితంలో కొన్ని వస్తువులు, కొందరు వ్యక్తుల విలువను తెలుసుకున్నాని వెల్లడించింది. `ఈ సందర్భంగా నేను తినే తిండి విలువ తెలుసుకున్నాను. మా నాన్న నన్ను ఎంతో మిస్‌ అవుతున్నాడని తెలుసుకున్నాను. నా ఇంటికి  నా అవసరం ఉందని తెలుసుకున్నాను. అంతేకాదు ఒక రోజు ఎందు సుధీర్ఘంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాను. మా అమ్మ బెడ్ రూమ్‌లో ఆమె చాయలు ఇంకా ఉన్నాయని తెలుసుకున్నాను.

నా చెల్లి ఖుషీ కూల్‌ సిస్టర్ అని, నేను బెటర్‌ పెయింటర్ అని గ్రహించాను. నేను సినిమాలను ప్రేమిస్తానని, వర్క్‌ అవుట్ చేయటంలో నాకు ఎవరి సహకారం అవసరం లేదని కూడా తెలుసుకున్నాను. జాన్వీ, ఖుషీలు దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల కూతుళ్లన్న విషయం తెలిసిందే. జాన్వీ బాలీవుడ్‌ లో హీరోయిన్‌గా నటిస్తుండగా ఖుషీ న్యూయార్క్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. లాక్‌ డౌన్‌కు కొద్ది రోజుల ముందే ఖుషీ  ఇండియాకు వచ్చింది.