1960, 70 కాలంలో జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. జార్జ్ రెడ్డి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పటి యువతకు జార్జ్ రెడ్డి ఆదర్శం అని అంతా చెబుతుంటారు. కానీ జార్జ్ రెడ్డి చరిత్ర అందరికి తెలియదు. జార్జ్ రెడ్డి జీవిత చరిత్రని పవర్ ఫుల్ గా దర్శకుడు జీవన్ రెడ్డి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. 

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్ర ట్రైలర్ చూసి ఆకర్షితులయ్యారట. వెంటనే దర్శకుడు జీవన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవన్ అభిమానులు సంబరపడే మరో వార్త బయటకు వచ్చింది. 

పవన్ కళ్యాణ్ జార్జ్ రెడ్డి చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. త్వరలో ఈ చిత్ర ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ బావుందని దర్శకుడు జీవన్ రెడ్డిని అభినందించగానే ఆడియో వేడుకకు కూడా హాజరు కావాలి రిక్వస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

వెంటనే పవన్ తన అంగీకారాన్ని తెలిపారు. యువ నటుడు సందీప్ మాధవ్ ఈ చిత్రంన్లో జార్జ్ రెడ్డిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 27నజార్జ్ రెడ్డి చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. యువత పట్ల తన ఆలోచనలకూ జార్జ్ రెడ్డి ట్రైలర్ దగ్గరగా ఉండడంతో పవన్ సంతోషించినట్లు తెలుస్తోంది.