ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు  ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటివరకు 24 సినిమాలు వస్తే దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి. అలాగే ఎన్ని సీక్వెల్స్ వచ్చినప్పటికీ బోర్ కొట్టకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో జేమ్స్ బాండ్ తన స్టామినాని భాక్సాఫీస్ వద్ద చూపిస్తూనే ఉన్నాడు.

ఈ నేపధ్యంలో జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా రెడీ అవుతోంది. ‘నో టైమ్ టు డై’ టైటిల్ తో రానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వదిలారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.ఇక క్యారీ జోజీ ఫుకునాగా దర్శకత్వంలో  రూపొందుతున్న ఈ సినిమాకు సరైన టైటిల్ కోసం కొంతకాలంగా సస్పెన్స్ నడిచింది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రం టీమ్ ముందుగా ‘షట్టర్ హ్యాండ్స్, ఎక్లిప్స్, ఏ రీజన్ టు డై’ అనే టైటిళ్లను పరిశీలించి ఫైనల్ గా ‘నో టైమ్ టు డై’ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో హీరోగా డానియెల్ క్రెగ్ నటిస్తుండగా, ఆయన ఈ సినిమాతో ఐదవసారి జేమ్స్ బాండ్ పాత్రను పోషించనుండడం విశేషం.  ఈ  సినిమాను 2020 లో ఏప్రిల్ 3న భారత్ లో,  బ్రిటన్ లో, ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది.