బిగ్ స్క్రీన్ తో పాటు బుల్లితెర కూడా స్టార్స్ కి ఇప్పుడు క్రేజ్ తెచ్చే మరొక ఆయుధంలా మారింది. కొంతమంది సీనియర్ యాక్టర్స్, టెక్నీషియన్స్ షోలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ క్రేజ్ తో పాటు బోనస్ గా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఎపిసోడ్ కి 3 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు, రోజా ఆ రూట్లో సక్సెస్ అయ్యారు. దీంతో మిగతా యాక్టర్స్ కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సీనియర్ యాక్టర్ జగపతిబాబు కూడా బుల్లితెరపై హోస్ట్ గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ కాబోయే ఒక న్యూ టాలెంట్ షో ద్వారా జగపతి బుల్లితెరపై సరికొత్తగా అలరించనున్నట్లు తెలుస్తోంది. షోకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగపతిబాబు కోసం నిర్వాహకులు సైబర్చిస్తున్నట్లు సమాచారం. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జగపతిబాబు ఇక బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారంటే ఆయన డేట్స్ పట్టుకోవడం కష్టమే.

హోస్ట్ గా చేసిన చాలా మంది సక్సెస్ అయ్యారు కానీ మంచి స్టార్ డమ్ ఉన్న కొంత మంది ఊహించని విధంగా ఫెయిల్ అయ్యారు కూడా. అందులో బ్రహ్మానందం ఒకరు. బిగ్ స్క్రీన్ పై పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన బ్రహ్మి ఒక కామెడీ షోకి జడ్జ్ గా చేసి ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయనను చూసి మరికొందరు కంటెంట్ కనెక్ట్ అయితే గాని బుల్లితెరలోకి అడుగు పెట్టడం లేదు. మరి ఇప్పుడు జగపతిబాబు ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.