సూపర్‌స్టార్‌ మహేష్  బాబు హీరోగా  అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం  మొన్న సంక్రాంతికి రిలీజై మంచి హిట్ అయ్యింది. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ పండగ అయ్యిపోగానే గాలి తీసినట్లుగా చప్ప బడిపోయింది. అమెరికాలో అయితే పోటీ సినిమాని తట్టుకోలేకపోయింది. అందుకు కారణం  సినిమాలో సరైన స్టఫ్ లేదని,కేవలం మాస్ ఎంటర్టైనర్ గా నడపటంపైనే దృష్టి పెట్టిన దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ స్దాయి సినిమా చేస్తున్నానని మర్చిపోయాడనే కామెంట్స్ వినిపించాయి.

అలాగే కామెడీ సైతం అనుకున్న స్దాయిలో పండలేదని, ప్రకాష్ రాజ్ పాత్ర ఏదో కార్టూన్ క్యారక్టర్ లాగ ఉందని, మహేష్ కు సరపడ విలనీ చేయలేకపోయాడని అన్నారు. అందులో చాలా భాగం నిజం కూడా ఉంది. అయితే ఇదే సమయంలో ఓ విషయం కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

విలక్షణ నటుడు జగపతి బాబు.. నుంచి షూటింగ్ టైమ్ లోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ తర్వాత జగపతిబాబు వివరణ కూడా ఇచ్చారు. జగపతిబాబు నిజానికి చెయ్యాల్సింది ప్రకాష్ రాజ్ పాత్ర.  ఆ పాత్ర కనుక జగపతిబాబు చేసి ఉంటే ఖచ్చితంగా విలనీ స్పష్టంగా కనపడేదని అంటున్నారు. ప్రకాష్ రాజ్ కు మహేష్ వార్నింగ్ ఇచ్చే సీన్ వంటివి మరింతగా పండేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జగపతిబాబుని ప్రక్కన పెట్టేయటం పెద్ద బ్లండర్ అని తేలిందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ బ్రిలియెంట్ యాక్టరే కానీ ఈ సినిమాకు తగ్గ క్రూయల్టీని పండించలేకపోయారని తేల్చారు.

 విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లను కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటించారు. రష్మిక మందన హీరోయిన్. దిల్‌రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.