వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత సినీ పెద్దలు ఎవరూ ఆయన్ని కలవలేదు. అప్పట్లో ఈ విషయంపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. కొందరు సెలబ్రిటీలు కలవాలని భావించినా.. వారికి అపాయింట్మెంట్ దొరకలేదనే మాటలు వినిపించాయి. 

కంటివెలుగు... గుంటూరు జిల్లాలో ఎవరెక్కడ ప్రారంభించారంటే

ఈ సంగతులు పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి.. జగన్ ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు.

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాను వీక్షించాల్సిందిగా చిరంజీవి.. జగన్ ని కోరనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిరంజీవి కలవడం ఇదే తొలిసారి. కాబట్టి జగన్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'సైరా' విడుదల సమయంలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు జగన్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారట.

ఇటీవల చిరంజీవి 'సైరా' సినిమాను చూడాలని తెలంగాణా గవర్నర్ సౌందరరాజన్ ను చిరంజీవి కోరారు. ఆమె తన కుటుంబంతో కలిసి సినిమా చూసి అధ్బుతంగా ఉందంటూ ప్రశంసించారు.