ప్రస్తుతం టాలీవుడ్ లో యాంకర్స్ హవా గట్టిగా నడుస్తోంది. చాలా వరకు యాంకర్ అనే పదానికి కొత్త అర్ధం చెబుతున్నారు. అవకాశం వస్తే వెండితెరపై కూడా వారి టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక హాట్ యాంకర్ కీ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు. జబర్దస్త్ యాంకర్ అనసూయ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ఈ సీనియర్ యాక్టర్ ఇప్పుడు పవన్ సినిమాలో కూడా కథను మలుపు తిప్పే పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయనున్నాడు. అదే సినిమాలో అనసూయ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఇక పవన్ తనకు గబ్బర్ సింగ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాను ఒకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక సీక్రెట్ గా అందిన సమాచారం ప్రకారం మరొక కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా పవన్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ప్రాజెక్ట్ కి చాలా సమయం పట్టేలా ఉంది. గౌతమ్ ప్రస్తుతం జెర్సీ కథను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఇక పవన్ తో వచ్చే ఏడాది కొత్త సినిమాని స్టార్ట్ చేసి 2021 ఎండింగ్ లోనే సినిమాని విడుదల చేయవచ్చని టాక్. పింక్ రీమేక్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది మే నెలలో రానుంది. ఇక క్రిష్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక హరీష్ శంకర్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ (మే) లో వచ్చే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ పవన్ ప్రణాళికలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి