ఒక సినిమా హిట్ అయితే దాని ప్రభావం ఖచ్చితంగా మిగతా సినిమా వారిపైనా, ఇండస్ట్రీపైనా పడుతుంది. అదే విధంగా ఫ్లాఫ్ అయినా అదే పరిస్దితి. మిగతా వాళ్లకు ప్రతీ విషయం ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి వస్తుంది. రీసెంట్ గా దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత రూపొందించిన జాను చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

తమిళ చిత్రం 96 రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఈ స్దాయిలో ప్లాఫ్ అవటానికి కారణాల్లో ప్రధానమైనది...చాలా మంది తమిళ ఒరిజనల్ సినిమాని చూసేయటమే అని తేల్చారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ తమిళ సినిమా ఉండటంతో తెలుగువాళ్లు ...రీమేక్ అవుతున్న ఈ సినిమా అంటూ చూసేసారు. ఇప్పుడు తమ సినిమా కూడా అలాంటి పరిస్దితి వస్తుందా అని రామ్ కంగారుపడుతున్నారట.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం తర్వాత రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల - రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని చాలా మంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల్లో చూసేసారు. ఇంకా చూడనివాళ్లు చూసేస్తున్నారు. తాము చూసిన తమ ఎక్సపీరియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది చూసి మరి కొంతమంది ఆ సినిమా పై ఉత్సాహం చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా భాక్సాఫీస్ మీద ప్రభావం చూపిస్తుందని రామ్ భావిస్తున్నట్లు సమాచారం.

 కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌.. సిద్ధార్థ్‌, ఆదిత్య అనే రెండు పాత్రల్లోకనిపించనున్నారు.అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్. టీజర్ లో ఆ దొంగ చేసే తప్పులని ఈ కాంట్రాక్టర్ మీదకు నెట్టి తపించుకోవాలని చూస్తాడు. అయితే ఈ కాంట్రాక్టర్ తాను నిర్దోషిని అని ఎలా నిరూపించుకుంటాడు అలాగే అసలైన దొంగ ను ఎలా పట్టిస్తాడు ఈ మధ్యలో వచ్చే సమస్యలు ఏంటి. ఇంత సమస్యల్లో కూడా వారు ప్రేమలో ఎలా పడుతారు అనేదే సినిమా.

ఇందులో నివేత పెత్తురాజ్ అసలైన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. ఈ టీజర్ మాత్రం సినిమా పై అంచనాలను పెంచిందనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను మేపిస్తుందో... లేదో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. ఇందులో రామ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ సందడి చేయనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.