సమంత - శర్వానంద్ జంటగా నటించిన చిత్రం జాను. ఓ వర్గం ఆడియెన్స్ ఈ సినిమా  కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళ్ సినిమా 96కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తమిళ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా కథ ఏంటో ఇప్పటికే చాలా మంచికి తెలిసే ఉంటుంది. తెలుగులో ఈ సినిమా తెరకెక్కుతోంది అనగానే చాలా మంది సినిమాని వీక్షించారు. అయితే దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎక్కడా కూడా కథ ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకుండా తెలుగులో కూడా అదే తరహాలో తెరక్కించాడు. మెయిన్ గా శర్వానంద్ - సమంత ల కాంబినేషన్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

కథలో మొదటి నుంచి చివరి వరకు తెలియని ఒక ఫీలింగ్ ని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చిన్నప్పటి పాత్రలు మాత్రం తమిళ్ లో క్లిక్కయినంతగా తెలుగులో క్లిక్ అవ్వలేదని అనిపిస్తోంది. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ ని ఎలివేట్ చేసింది. సాంగ్స్ కూడా పరవాలేదని చెప్పవచ్చు. తమిళ్ 96 సినిమా చూసిన వాళ్ళకి కొంత కొత్త తరహా ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆ సినిమతో పోలిస్తే మాత్రం జాను సరితూగదనే టాక్ వస్తోంది. మరీ సినిమా ఎంతవరకు వసూళ్లు అందుకుంటుందో చూడాలి.