శర్వానంద్ కి పెద్ద దెబ్బే.. ‘జాను’ బ్రేక్ ఈవెన్ కష్టమే?
అందుతున్న సమాచారం మేరకు 'జాను' మొదటి నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.7.24 కోట్ల షేర్(రూ.13.15 కోట్లు) మాత్రమే సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 19.20 కోట్లు.
శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు సంభందం లేకుండాపోయింది. ఇది నిర్మాతను, ట్రేడ్ వర్గాలను కంగారుపెడుతోంది.
అందుతున్న సమాచారం మేరకు 'జాను' మొదటి నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.7.24 కోట్ల షేర్(రూ.13.15 కోట్లు) మాత్రమే సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 19.20 కోట్లు. ఈ రెండూ బేరేజు చేసుకుంటే 'జాను' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.11.96 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం కలెక్షన్స్ చాలా డల్ గా ఉన్నాయి. మెట్రోలలో కూడా అదే పరిస్దితి. దాంతో ఈ సినిమా డిజాస్టర్ గా చివరకు తేలినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. దానికి తోడు ఓవర్ సీస్ లో కూడా కలెక్షన్స్ షాక్ ఇస్తున్నాయి. సమంతకు మొదట నుంచీ ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ ఉన్నా అదేమీ కనపడటం లేదు.
గ్యాప్ రావొచ్చు కానీ.. అసత్య ప్రచారంపై సమంత!
అందుకు కారణం మొదటి రోజు నుంచే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బి,సి సెంటర్స్‌లో వసూళ్లు అసలు లేవు. అంతేకాక ఈ సినిమాని చూసే టార్గెట్ ఆడియన్స్ చాలా మంది తమిళ 96 చూసేయటం అంటున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా పెద్ద హిట్టైంది. 96 సినిమాను తమిళంలో చూసిన ప్రేక్షకులు తెలుగులో డిస్సప్పాయింట్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడితే బాగుండేదంటున్నారు.
ఈ సినిమా వల్ల సమంతకు జరిగే నష్టం ఏమీ లేదు. కానీ శర్వాకు మాత్రం పెద్ద దెబ్బే. జానుకు ముందు శర్వా నటించిన 'పడి పడి లేచే మనసు', 'రణరంగం' సినిమాలు కూడి డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు జాను కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశనే మిగిల్చటం ఇబ్బందే. జాను సినిమాను దిల్‌రాజు నిర్మించగా..ఆ తమిళ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు.