Asianet News TeluguAsianet News Telugu

‘జాను’ కలెక్షన్స్ దెబ్బకొడుతోంది... అమెజాన్ ప్రైమ్..?

ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేకపోవటం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. వీకెండ్ మూడు రోజల షేర్ ..ఎనిమిది కోట్ల లోపే ఉంది. అది బయ్యర్లను కంగారుపెడుతోంది.

Jaanu collections affected by amazon prime?
Author
Hyderabad, First Published Feb 10, 2020, 12:39 PM IST

శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.రివ్యూలన్నీ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అన్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేకపోవటం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. వీకెండ్ మూడు రోజల షేర్ ..ఎనిమిది కోట్ల లోపే ఉంది. అది బయ్యర్లను కంగారుపెడుతోంది.

ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా దుమ్ము దులుపుతుంది అనుకుంటే అక్కడ కూడా కలెక్షన్స్ షాక్ ఇస్తున్నాయి. సమంతకు మొదట నుంచీ ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ ఉన్నా అది భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. వీకెండ్ లలోనే ఇలా ఉంటే ఇక సోమవారం నుంచి వచ్చే శుక్రవారం వరకూ ఎలా ఉండబోతున్నయనేది ఓ పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. వచ్చే వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ వస్తుందని అనుకుందామన్నా...అది జరిగే అవకాసం చాలా తక్కువ ఉంది. ఏదన్నా మ్యాజిక్ జరిగి...ఫ్యామిలీలు ఈ సినిమాకు బయిలుదేరితేనే వర్కవుట్ అవుతుంది.

`జాను` మూవీ రివ్యూ...

అయితే ఇందుకు కారణం ...ఓటీటి ఫ్లాట్ ఫామ్ లు అని తేలుస్తున్నారు. టాక్ బాగున్నా..మల్టిఫ్లెక్స్ లు మిహా థియోటర్స్ దగ్గర జనం కనపడటం లేదు. చాలా మంది తమిళ 96 చూసేయటం అందుకు కారణంగా చెప్తున్నారు.తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమాకు జాను రీమేక్ అన్న విషయం తెలిసిందే.  అదే యాజటీజ్.. మక్కీకి మక్కీ రీమేక్ చేయటంతో తెలుగులో మళ్లీ ఏం చూస్తాములే అని పెదవి విరుస్తున్నారు.

 ఇక ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే 96 సినిమాను తమిళంలో చూసిన ప్రేక్షకులు డిస్సప్పాయింట్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడితే బాగుండేది. జాను సినిమాను దిల్‌రాజు నిర్మించగా..ఆ తమిళ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు

Follow Us:
Download App:
  • android
  • ios