Asianet News TeluguAsianet News Telugu

‘జాను’ వల్ల శర్వానంద్ కు ఇంకో పెద్ద సమస్య?

సినిమా మెల్లిగా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. అయితే ఇలాంటి సినిమాల వల్ల దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. లాభాలు ఉండవంతే. 

Jaanu affect on Sharwanand's Career?
Author
Hyderabad, First Published Feb 22, 2020, 4:31 PM IST

శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. దిల్ రాజు నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు సంభందం లేకుండాపోయింది. 

 

ఇది నిర్మాతను, ట్రేడ్ వర్గాలను కంగారుపెట్టింది. సినిమా మెల్లిగా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. అయితే ఇలాంటి సినిమాల వల్ల దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. లాభాలు ఉండవంతే. అలాగే సమంతకు కూడా కెరీర్ పరంగా నష్టమేమీ లేదు. ఆమె గురించి ఈ సినిమా కు వెళ్లరు కాబట్టి. అయితే వచ్చిన చిక్కల్లా శర్వానంద్ కే. అతని కెరీర్ కు ఈ సినిమా పెద్ద దెబ్బ కొట్టింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జాను సినిమా డిజాస్టర్ అవ్వడంతో... అతడు నటిస్తున్న శ్రీకారం సినిమాకి బిజినెస్ పరంగా కొత్త సమస్య వచ్చింది. శర్వా హీరోగా రూపొందుతున్న శ్రీకారం సినిమా షూటింగ్ దాదాపు పూర్తైపోయి, రిలీజ్ కు రెడీ అయింది. కేవలం ఇంకొక్క చిన్న షెడ్యూల్ మాత్రమే బాలెన్స్ ఉంది. కానీ  శాటిలైట్ డీల్ ఇంకా లాక్ కాలేదని సమాచారం. దాంతో శ్రీకారం నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ వారు టెన్షన్ లో పడ్డారు. జాను ఫలితం చూపెట్టి శాటిలైట్ కంపెనీలు దారుణంగా బేరాలు మొదలెట్టాయంట. దాంతో శర్వాకు విషయం అర్దమైంది. మొహమాటానికి పోయి జాను లాంటి సినిమాలు చేయకూడదని అర్దమైంది.
 
ఇక జాను సినిమాకు మొదటి రోజు నుంచే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే కొద్దో గొప్పో ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బి,సి సెంటర్స్‌లో వసూళ్లు అసలు లేవు. అంతేకాక ఈ సినిమాని చూసే టార్గెట్ ఆడియన్స్ చాలా మంది తమిళ 96 చూసేయటం జరిగింది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా పెద్ద హిట్టైంది. 96 సినిమాను తమిళంలో చూసిన ప్రేక్షకులు తెలుగులో డిస్సప్పాయింట్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడితే బాగుండేదంటున్నారు.

జానుకు ముందు శర్వా నటించిన 'పడి పడి లేచే మనసు', 'రణరంగం' సినిమాలు కూడి డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు జాను కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశనే మిగిల్చటం ఇబ్బందే. జాను సినిమాను దిల్‌రాజు నిర్మించగా..ఆ తమిళ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు.

Follow Us:
Download App:
  • android
  • ios