చిన్నారి పెళ్లి కూతురు ఫేం రుస్లాన్‌ ముంతాజ్‌ తండ్రయ్యాడు. మార్చి 26న రుస్లాన్‌, నిరాలి మెహతా దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న రుస్లాన్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తాను చిన్నారితో ఉన్న ఫోటోను షేర్‌ చేసిన రుస్లాన్‌.. `చిన్న బాబు వచ్చేశాడు. ఇక నుంచి మరో మూడు నాలుగు నెలల పాటు నా బాబు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. చిన్నారి జన్మించిన వార్త మీ రోజును కాంతివంతం చేస్తుంది.` అంటూ కామెంట్ చేశాడు.

హాస్పిటల్‌లో భార్య, చిన్నారితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన రుస్లాన్‌.. `నేను నిజంగా నమ్ముతున్నాను.. ఇలాంటి కష్ట కాలంలో బాబు పుట్టడం అంటే అందుకే ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే నేను నా చోటా బేబీ కష్ట కాలంలో వచ్చిన సూపర్‌ హీరో అని నమ్ముతున్నా. అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ తన భార్య కలిసి ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు రుస్లాన్‌ ముంతాజ్‌.

ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే 2007లో వచ్చిన మేరు పెహ్లా పెహ్లా ప్యార్‌ సీరియల్‌తో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అంతేకాదు జాబ్‌రియా జోడి, డేంజరస్‌ ఇస్క్‌ లాంటి  సినిమాల్లోనూ నటించాడు రుస్లాన్‌. బాలికా వధు సీరియల్‌ తో అందరికి గుర్తుండిపోయాడు ఈ యువనటుడు.