టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. కెరీర్ మొదట్లో ఎంతో బిజీగా కనిపించిన మణిశర్మ తన పాటలతో మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలకు పాటలతో మంచి హైప్ క్రియేట్ చేయగల మణిశర్మ కొన్నేళ్ల వరకు హిట్స్ లేక చాలా స్ట్రగుల్ అయ్యారు.

మ్యూజిక్ బావున్నప్పటికీ సినిమాలు డిజాస్టర్స్ అవుతుండడంతో పెద్ద సినిమాలకు చేసే అవకాశం అందుకోలేకపోయారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగానే అందరి చూపు మళ్ళీ మణిశర్మపైనే పడింది. రీసెంట్ గా మెగాస్టార్ కూడా మణిశర్మని కలిసి నెక్స్ట్ సినిమా కోసం సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ మరో బిగ్ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

ఆ సినిమాకు మణిశర్మ అయితేనే కరెక్ట్ అని రామ్ చరణ్ - కొరటాల కూడా మెగాస్టార్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ముందుగానే రామ్ పోతినేని రెడ్ సినిమాకు మణిశర్మ సెలెక్ట్ అయ్యారు. అలాగే పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ అప్ కమింగ్ ఫిల్మ్ ఫైటర్ కి కూడా మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు.

ఇవే కాకుండా వెంకటేష్ అసురన్ రీమేక్ కి కూడా మెలోడీ బ్రహ్మ ట్యూన్స్ కంపోజ్ చేయడానికి రెడీ అయినట్లు టాక్. మణిశర్మ ఇలా వరుసగా నాలుగు పెద్ద సినిమాలను ఒప్పుకొని చాలా కాలమైంది. ఇక నుంచి కథ నచ్చితేనే సినిమా చేయాలనీ పెద్ద సినిమాల విషయంలో కూడా ఆచి తూచి అడుగు వేయాలని మణిశర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.