టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉందనే చెప్పాలి. సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి ఏ హీరోలు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక కొంతమంది ప్లాప్స్ కారణంగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కువగా పూజాహెగ్డే హవా నడుస్తోంది. అలాగే గీతా గోవిందం బ్యూటీ రష్మిక మందన్నా కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే విధంగా ఇస్మార్ట్ బ్యూటీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నన్ను దోచుకుందువటే.. సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన నాభా ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అనంతరం బేబీకి డిస్కోరాజా లో అవకాశం ఉందింది. వరుసగా ఇటీవల 10కి పైగా అవకాశాలు వచ్చినప్పటికీ అమ్మడు మాత్రం తనకు సెట్టయ్యేది కథలను మాత్రమే ఎంచుకుంటోంది.

సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న నాభా వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఇదే తరుణంలో కొన్ని కమర్షియల్ సినిమాలు అఫర్ చేస్తుండడంతో రెమ్యునరేషన్ గట్టిగా పెంచేసినట్లు తెలుస్తోంది.  ఇంతకుముందు కంటే ఇప్పుడు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

బెల్లకొండ శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నాభా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఆ సినిమాలో నటించడానికి బేబీకి డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారట. ప్రస్తుతం సౌత్ లో కొత్త హీరోయిన్స్ తో నటించాలని అనుకుంటున్న కుర్ర హీరోలకు నాభా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అందుకే డిమాండ్ చేసినంత ఇస్తున్నారు. మరి అమ్మడు ముందుముందు ఇంకెలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.