Asianet News TeluguAsianet News Telugu

ట్రైలర్ బాగుంది...సితార ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చూడాలి!

నవంబర్‌ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రం టీమ్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేస్తే..మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Is Sithara impact on Frozen 2 telugu version?
Author
Hyderabad, First Published Nov 19, 2019, 9:43 AM IST

‘ఎల్సా గతమంటే మనకు తెలిసింది మాత్రమే కాదు. నువ్వు నిజమేంటో కనుక్కోవాలి.’ అనే డైలాగుతో ప్రారంభమయ్యే  ‘ఫ్రోజెన్‌ 2’ ట్రైలర్‌ వచ్చిసింది. హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్‌, మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. 2013లో విడుదలై సక్సెస్ సాధించిన ‘ఫ్రొజెన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్‌ 2’ తెరకెక్కుతుంది. తెలుగులో రాబోతున్న ఈ చిత్రంలోని రాకుమార్తె ఎల్సా పాత్రకు నిత్యామేనన్‌ గొంతునిస్తే....   సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కుమార్తె సితార ఈ చిత్రంలో చిన్నప్పటి ఎల్సా పాత్రకు వాయిస్‌ను అందించారు.

నవంబర్‌ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రం టీమ్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేస్తే..మంచి రెస్పాన్స్ వచ్చింది. హాస్యనటుడు ప్రియదర్శి.. మంచు మనిషి ఓలఫ్‌కు స్వరం అరువిచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబరు 22న విడుదలవుతోంది. మీరు ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడవచ్చు.

ఇక సితార ఎఫెక్ట్ ఎంతవరకూ పని చేస్తుంది..సినిమాకు ఓపినింగ్స్ కు ఎంతవరకూ కలిసొస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్తున్నారు. ఖచ్చితంగా సితార..మహేష్ కుమార్తె కావటం, ఈ చిన్న వయస్సులోనే సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఆమెకు ఆదరణ ఉండటంతో ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.

సితార మాట్లాడుతూ – ‘‘చిన్నారి ఎల్సాకు డబ్బింగ్‌ చెప్పడాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చేస్తున్నట్లు నాన్నకు చెప్పినప్పుడు సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యారు’’ అన్నారు.

నమ్రత మాట్లాడుతూ.. ‘‘తొలిసారి సితార డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు ఓ తల్లిగా ఎంతో సంతోషంగానూ కాస్త భయంగానూ అనిపించింది. ఎల్సాకి సితార చక్కగా డబ్బింగ్‌ చెప్పింది. దీనికోసం తను ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. తన డ్యాన్స్‌ టీచర్‌ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. సితారకు ఎల్సా పాత్రంటే చాలా ఇష్టం. ఆ పాత్రకు ఇప్పుడు తానే డబ్బింగ్‌ చెప్పడం ద్వారా తన కల నిజమైనట్లయింది. ఇది తనకి అనుకోకుండా దక్కిన అవకాశం’’ అన్నారు.
 
నటి నిత్య మీనన్‌ మాట్లాడుతూ.. ‘‘నిజానికి డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. యానిమేటెడ్‌ చిత్రాలు పెద్దగా చూడను. కానీ, ఈ చిత్రం కోసం డిస్నీ వాళ్లు నన్ను అడిగినప్పుడు వెంటనే చేస్తానని చెప్పేశా. ఎందుకంటే నాకు ‘ఫ్రోజెన్‌’ చాలా ఇష్టం. అందులోని ఎల్సా నాకు బాగా గుర్తుంది. పిల్లలకి చాలా ఇష్టమైన, బలమైన పాత్ర ఇది. తొలి భాగం వచ్చినప్పుడు నా స్నేహితురాలు చెప్తే వెళ్లి ఆ సినిమా చూశా. అప్పుడే చాలా బాగా నచ్చేసింది. ఈ పాత్రకు నాకూ కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంటన్నది కచ్చితంగా చెప్పలేను. ఇలా ఓ యానిమేటెడ్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం చాలా కొత్తగా అనిపించింది. ఆంగ్ల భాషలో ఉన్న సంభాషణలను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా లిప్‌ సింక్‌ చేస్తూ చెప్పడాన్ని చాలా ఎంజాయ్‌ చేశా’’ అన్నారు.

 తొలి భాగం వచ్చిన ఆరేళ్ల తర్వాత రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని సృష్టించామని చెప్తున్నారు. ఎల్సా, యానా పాత్రలతో పాటు ఇందులో ఓలఫ్‌ మంచు మనిషి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఎల్సాకి అద్భుత శక్తులు ఎలా వచ్చాయి. ఆమె గతమేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే క్రమంలో వాళ్లు చేసే ప్రయాణం.. అందులో భాగంగా చేసే సాహసాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఎల్సా ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకమైన పాత్ర అంటూ డిస్నీ వారు ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios