సక్సెస్ కోసం రకరకాల స్కీమ్ లు ఫాలో అవుతూంటారు హీరోలు,హీరోయిన్స్. సక్సెస్ తో దూసుకుపోతున్న స్టార్స్ ఎక్కడ క్లిక్ అవుతున్నారో గమనించి అదే ఫాలో అవుతూంటారు. హీరోలు యాక్షన్ కామెడీ ల వైపు ప్రయాణం పెట్టుకోవటం అలాంటి స్ట్రాటజీనే. ఇప్పుడు రష్మిక కూడా దాదాపు అలాంటి తెలివినే ప్రదర్శిస్తోంది అంటున్నారు. ఆమె కెరీర్ ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న విశ్లేషకులు. సాయి పల్లవిని ఎక్కడ వర్కవుట్ అవుతోందో గమనించి అదే రష్మిక చేస్తోందంటున్నారు.

సాయి పల్లవి ..ఓ మంచిగానే కాక మంచి డాన్సర్ గా ఈ జనరేషన్ హీరోయిన్స్ లో నిలిచిపోతోంది. ఆమె వేసే మాస్ స్టెప్స్ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్నాయటంలో సందేహం లేదు. ఆ స్టెప్స్ తోనే అప్పటిదాకా రాని పేరు, క్రేజ్ ఆమెకు సొంతమైంది. ఇప్పుడు రష్మిక కూడా అదే సక్సెస్ ఫార్ములాను పట్టుకుంది. స్టార్స్ సినిమాల్లో నటనకు ఎలాగో అవకాసం ఉండదు. ఎక్కువ పాటలకే ఆమెను తీసుకుంటారు.

ఆ విషయం గమనించిన ఆమె సాయి పల్లవి తరహాలోనే డాన్స్ కు ప్రయారిటీ ఇస్తోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఆమె అదే పనిచేసింది. ఆమె వేసిన స్టెప్స్ కు థియోటర్స్ దద్దరిల్లాయి. దాంతో ఇప్పుడు భీష్మకు సైతం అదే స్ట్రాటజీని అనుసరిస్తోంది.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన 'వాటే బ్యూటి' సాంగ్ వీడియో ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రోమోలో నితిన్, రష్మిక జంట సూపర్ గా ఉంది.

అంతేకాకుండా స్టెప్స్ లో  నితిన్ కి ఎక్కడ కూడా తగ్గకుండా పోటీపడింది రష్మిక మందన్నా. ఇప్పుడదే మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. జాని మాస్టర్ ఈ పాటని కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ని అందించాడు.  ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫై నాగ వంశీ నిర్మిస్తుండగా మణిశర్మ కుమారుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.సంపత్, బ్రహ్మాజీ, వెన్నల కిషోర్, రఘుబాబు, నరేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రొమాటింక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.