సాహో తర్వాత ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపైనే అందరి దృష్టీ ఉంది. అయితే ఇప్పటిదాకా ఆ సినిమాకు సంభందించిన ప్రమోషన్ స్టార్టవలేదు. షూటింగ్ కూడా బాగా లేటవుతోంది అర్దమవుతోంది. సాహో ఎఫెక్ట్ లో స్క్రిప్టు మార్పులు, బడ్జెట్ కుదింపులతో సినిమా సరైన స్పీడు అందుకోలేదు. అయితే ఇప్పుడు మీడియాలో ఓ కొత్త ప్రచారం మొదలైంది.

ప్రభాస్...ఆ సినిమాపై పూర్తి సీరియస్ నెస్ తో పనిచేయటం లేదంటున్నారు. షూటింగ్ కు బాగా లేటుగా వస్తున్నాడని, రోజుకు సీన్స్ కూడా పెద్దగా అవటం లేదని అంటున్నారు. ఇప్పటికి సినిమాకు సరైన క్రేజ్ కూడా క్రియేట్ కాలేదు. దర్శకుడు మొదట సినిమా ఆడకపోవటంతో కేవలం ప్రభాస్ ని అడ్డం పెట్టే ప్రమోషన్, బిజినెస్ అన్ని జరగాలి. దానికి తోడు దాన్ని ప్యాన్ ఇండియా సినిమాగా మార్చాలనే తపనతో చేస్తున్న మార్పులు ఏ స్దాయిలో వర్కవుట్ అవుతాయనేది అందరిలో ఉన్న సందేహం.

కాస్ట్లీ కార్లు.. లగ్జరీ ఇల్లు.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూశారా..?

జెట్ స్పీడులో చేస్తేకానీ దసరా రిలీజ్ కు రావటం కష్టం. దానికి తోడు పీరియడ్ చిత్రం కావటంతో గ్రాఫిక్స్ ,విఎఫ్ ఎక్స్ కూడా చాలా పని ఉంటుంది. ప్రభాస్ సొంత బ్యానర్...యువి క్రియేషన్స్ కావటంతో నిర్మాత వైపు నుంచి ప్రెజర్ లేకపోవటమే ఇంతకీ కారణం అని తేలుస్తున్నారు. ప్రభాస్ కు ఇవన్నీ తెలియదా...నిజంగా లేజీనెస్ అతన్ని ఇబ్బంది పెడుతోందా అంటే...దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.  

అయితే అందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘జిల్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందించిన కె.కె. రాధాకృష్ణ దర్శకుడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.