2012లో వచ్చిన ఓఎంజీలో పరేష్ రావల్, అక్షయ్ కుమార్ నటించారు. తెలుగులో వచ్చిన గోపాల గోపాల మూవీలో పరేష్ రావల్ పాత్రలో వెంకటేశ్, అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కు అభిమానులతో పాటు కొందరు శత్రువులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అంతగా నెగిటివ్ గా ఎవరూ ప్రచారం చేయటానికి ఇష్టపడేవారు కాదు కానీ ఇప్పుడు ఆయన ప్రతీ విషయానికి టార్గెట్ చేయటం, ట్రోల్ చేయటం జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ కామన్ కాబట్టి తమ టీమ్ తో తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తూంటారు. ఆ క్రమంలో ఆయన తాజాగా చేసిన బ్రో సినిమాపై పొగడ్తలు, తెగడ్తలు, కంప్లైంట్స్, కామెడీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో అంబటి రాంబాబు డాన్స్ పెట్టడం, కొన్ని పొలిటికల్ డైలాగులు, వైసీపీ నేతలకు, పార్టీ అభిమానులకు కోపం తెప్పించాయి. దాంతో పవన్ టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఆయన రీమేక్ వైపు దృష్టి పెట్టారంటూ వార్తలు మొదలయ్యాయి.
ఆ సినిమా మరేదో కాదు ఓఎంజీ 2 .తెలుగులో వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీ గుర్తుందా? ఈ సినిమా హిందీలో 2012లో వచ్చిన ఓఎంజీ: ఓ మై గాడ్ కు రీమేక్. ఇప్పుడా ఓఎంజీకి 11 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ఈ మూవీ పేరు ఓఎంజీ2. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్ నటించిన ఈ మూవీ రిలీజ్ డేట్ ను శుక్రవారం (జూన్ 9) అనౌన్స్ చేశారు.ఉమేష్ శుక్లా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అక్షయ్ శివుడులా కనిపించనున్నారు. ఈ సినిమా హిట్టైతే .. దాన్ని పవన్ రీమేక్ చేస్తాండంటున్నారు.

ఓ మై గాడ్ మూవీకి,తెలుగులో చేసిన గోపాల గోపాల చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవుడి చర్య వల్ల నష్టపోయిన ఓ సామాన్యుడు.. ఆ దేవుడిపైనే కోర్టులో కేసు వేసి గెలవడం అనే కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు పవన్ ...బ్రో లో దేవుడుగా కనిపించారు. ఓఎంజీ 2 హిట్ అయితే తెలుగులో గోపాల గోపాల 2 చేసే ఆలోచన ఆ నిర్మాతలకు లేదా ఆ హీరోలకు ఉందో లేదో కానీ పవన్ ప్రత్యర్దులు మాత్రం కోరుకుంటున్నట్లున్నారు. ఆ పాయింట్ ని అడ్డం పెట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు.
