`ది ఘోస్ట్` సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ రెడీ అయ్యింది. అయినా సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ రాలేదు. ప్రమోషన్లు ద్వారా ఏమన్నా మ్యాజిక్ జరుగుతోందేమో చూడాల్సిన విషయం.
ఈ ఏడాది "బంగార్రాజు" గా ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున త్వరలోనే "ఘోస్ట్" గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున తొలిసారి ఇంటర్పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్. దుబాయ్, ఊటీ వంటి ఔట్ డోర్లలో నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఓ ఆసక్తికమైన డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఈ సినిమాకు డైరక్ట్ ఓటిటి డీల్ వచ్చినా కాదని నాగ్...థియోటర్ రిలీజ్ కు వస్తున్నారని చెప్తున్నారు. గతంలోనూ వైల్డ్ డాగ్ రిలీజ్ సమయంలో నాగ్ ..మంచి రేటుకు ఓటిటి డీల్ వచ్చినా వద్దనుకుని థియోటర్ కు వచ్చారు. కానీ థియోటర్ లో నాగార్జున చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ సారి మళ్లీ అదే పొరపాటు చేయబోతున్నారా అని ఓ వర్గం మీడియా, ట్రేడ్ లోనూ ,ఫిల్మ్ సర్కిల్స్ లోనూ మాట్లాడుకుంటున్నారు.
బయిట థియేటర్ మార్కెట్ అసలు బాగోలేదు. బజ్ క్రియేట్ అయిన సినిమాలకు ఓపినింగ్స్ రావటం లేదు. దానికి తోడు నాగార్జున సినిమా బాక్సాఫీసు దగ్గర వర్కవుట్ అయ్యి చాలా కాలమైంది. ఆయన గత సినిమాలు ఆఫీసర్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్… ఇలా అన్నీ ఫ్లాపులే. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన `బంగార్రాజు` మాత్రం కాస్త ఒడ్డెక్కింది. `ది ఘోస్ట్` సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ రెడీ అయ్యింది. అయినా సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ రాలేదు. ప్రమోషన్లు ద్వారా ఏమన్నా మ్యాజిక్ జరుగుతోందేమో చూడాల్సిన విషయం.
టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర పరిస్దితులు ఇప్పుడు ఆశాజనకంగా లేవు. పెద్ద స్టార్ సినిమాలకు సైతం టెన్షన్ పుట్టిస్తోంది. అయితే ఇవన్ని నాగ్ పట్టించుకున్నట్లు లేరు. ఈ సినిమాని నేరుగా థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర టీమ్ స్పష్టం చేసింది. ఇప్పుడు విడుదల తేదీ కూడా ప్రకటించేసింది. అక్టోబరు 5న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. `శివ` విడుదల తేదీ ఇది. నాగార్జున కెరీర్‌నే కాదు, తెలుగు సినిమా ఒరవడినే మార్చేసింది. ఆ తేదీన… నాగార్జున తన ఘోస్ట్ ని విడుదల చేస్తున్నారు. తగ్గించిన రేట్లకే టికెట్ ని అమ్ముతామని నిర్మాతలు చెప్తున్నారు. చూడాలి నాగార్జున ..ఓటిటికు ఈ సినిమా ఇవ్వకుండా థియేటర్ రిలీజ్ కు వెళ్లటం పొరపాటా లేదా సరైన నిర్ణయమా అనేది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
